Samsung Galaxy F22 specifications: గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైనా మొబైల్ రంగంలో తనకు తానే సాటిగా ముందుకు సాగుతోంది దక్షిణకొరియా కంపెనీ శాంసంగ్. గెలాక్సీ సిరీస్ తరువాత ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన శాంసంగ్ ఎం సిరీస్‌లో పలు ఆకర్షణీయమైన మోడల్స్, వేరియంట్స్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది.
తాజాగా మరో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 మోడల్ లాంఛ్ చేయడానికి అంతా సిద్ధం చేసుకుంది. జులై తొలి వారంలోనే శాసంగ్ గెలాక్సీ ఎఫ్22 (Samsung Galaxy F22) మోడల్ భారత మార్కెట్లోకి విడుదల అవుతుంది. జులై 6న మధ్యాహ్నం 12 గంటలకు ఈ Samsung మొబైల్ లాంచ్ కానుంది. ఎఫ్ సిరీస్ మొబైల్స్ 90HZ డిస్‌ప్లేతో వస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 ఎంపీ కెమెరా దీని ప్రత్యేకత. ఈ మొబైల్ గెలాక్సీ ఏ22 మోడల్ తరహాలోనే కనిపిస్తుంది. గతవారమే ఏ సిరీస్ మార్కెట్‌లోకి శాంసంగ్ విడుదల చేసింది.
Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 ఫీచర్లు (Samsung Galaxy F22 Specifications)
- ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే
- 6.4 అంగుళాల HD+ sAMOLED డిస్‌ప్లే
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 6 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ ఓఎస్ 11
- స్కెయర్ ఆకారంలో రియర్ కెమెరా
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 48MP క్వాడ్ రియర్ కెమెరా
- 90HZ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ హీలియో జీ80 చిప్‌సెట్
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 మొబైల్స్ విక్రయాలు జరుగుతాయి. జులై 6న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి విడుదల అవుతాయి. ధర విషయానికొస్తే దాదాపు రూ.15000 ఉండొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: LPG Cylinder Price: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు, ఆయా నగరాలలో లేటెస్ట్ ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook